IBFPL: 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' విశేషాలు ఇవే; భారత్ నుంచి 'హై-స్పీడ్ డీజిల్' రవాణా
ఈ వార్తాకథనం ఏంటి
భారత్- బంగ్లాదేశ్ మధ్య ఇంధన భద్రతలో సహకారాన్ని మెరుగుపర్చేందుకు చేపట్టిన 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్'(ఐబీఎఫ్‌పీఎల్) ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యింది.
ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం సాయంత్రం 5గంటలకు సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించున్న నేపథ్యంలో దానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం.
'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్'ను రూ.377 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఇందులో బంగ్లాదేశ్ రూ.285 కోట్లు ఖర్చు చేసింది.
'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్'ను 131.5కిలో మీటర్ల పొడవుతో నిర్మించారు. భారతదేశం-బంగ్లాదేశ్‌కు డీజిల్ సరఫరా చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది.
ఈ ఏడాది జూన్‌లో ప్రయోగాత్మకంగా డీజిల్ సరఫరా ప్రారంభమవుతుంది.
భారతదేశం మంజూరు చేసిన నిధుల సహాయంతో 2018లో ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైంది.
బంగ్లాదేశ్
ప్రతి సంవత్సరం 1 మిలియన్ మెట్రిక్ టన్నుల హై-స్పీడ్ డీజిల్ రవాణా
పైప్‌లైన్ ఉత్తర బంగ్లాదేశ్‌లోని ఏడు జిల్లాలకు ప్రతి సంవత్సరం 1 మిలియన్ మెట్రిక్ టన్నుల హై-స్పీడ్ డీజిల్‌ను రవాణా చేస్తుంది.
నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్ఆర్ఎల్) సిలిగురి ఆధారిత మార్కెటింగ్ టెర్మినల్ నుంచి బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ)కి చెందిన పర్బతిపూర్ డిపో వరకు ఈ పైప్‌లైన్ ఉంటుంది.
ఇంధన రవాణా 15 సంవత్సరాల పాటు కొనసాగేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఆ తర్వాత ఒప్పందాన్ని పొడిగించుకునే అవకాశం కూడా ఉంది.
భారతదేశం నుంచి బంగ్లాదేశ్‌కు హెచ్ఎస్‌డీ(హై-స్పీడ్ డీజిల్) రవాణా చేయడానికి స్థిరమైన, విశ్వసనీయమైన, ఖర్చుతో కూడుకున్న పర్యావరణ అనుకూల పద్ధతితో 'ఐబీఎఫ్‌పీఎల్'ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ కార్యాలయం(పీఎంఓ) పేర్కొంది.