Bangladesh Floods: బంగ్లాదేశ్‌లో వరదలకు మా డ్యామ్ కారణం కాదు.. స్పష్టం చేసిన MEA
బంగ్లాదేశ్‌లో వరద పరిస్థితి గుమ్టి నదిపై భారత డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడం వల్ల కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. త్రిపురలోని గుమ్టి నదిపై ఉన్న డంబూర్ డ్యామ్‌ను తెరవడం వల్ల బంగ్లాదేశ్ తూర్పు సరిహద్దులోని జిల్లాల్లో ప్రస్తుత వరద పరిస్థితి ఏర్పడిందని బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది వాస్తవంగా సరికాదని ఆయన స్పష్టం చేశారు.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ, "త్రిపురలోని గుమ్టి నదిపై డుంబూర్ డ్యామ్ తెరవడం వల్ల బంగ్లాదేశ్ తూర్పు సరిహద్దులోని జిల్లాలలో ప్రస్తుత వరద పరిస్థితి ఏర్పడిందని బంగ్లాదేశ్‌ఆందోళన వ్యక్తం చేసింది. ఇది వాస్తవంగా సరైనది కాదు."
40MW పవర్‌ను బంగ్లాదేశ్ ఉపయోగించుకుంటోంది
భారతదేశం, బంగ్లాదేశ్ ల్లో ప్రవహిస్తోన్నగుమ్టి నది పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ,ఈ సంవత్సరం అత్యధిక వర్షపాతం నమోదు అవ్వడం బంగ్లాలో వరదలకు దిగువ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు కారణం''అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్‌కు ఎగువన 120 కిలోమీటర్ల దూరంలో డంబూర్ డ్యామ్ ఉందని పేర్కొన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇది తక్కువ ఎత్తు (సుమారు 30 మీటర్లు)డ్యామ్ అని,ఇది గ్రిడ్‌లోకి వెళ్లి బంగ్లాదేశ్‌కు విద్యుత్తును అందిస్తుందని.. ఇది త్రిపుర నుండి 40 మెగావాట్ల పవర్‌ను ఉపయోగించుకుంటోంది అని తెలిపింది. సుమారు 120 కి.మీ నదీ మార్గంలో అమర్‌పూర్,సోనామురా,సోనామురా 2 వద్ద మూడు నీటి మట్టాల పరిశీలన కేంద్రాలు ఉన్నాయని పేర్కొంది.
బంగ్లాదేశ్‌కు నీటి ఉద్ధృతి గురించిన సమాచారాన్ని పంపుతున్నాము: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఇక, ఆగస్టు 21 నుండి మొత్తం త్రిపుర, బంగ్లాదేశ్‌లోని పరిసర జిల్లాల్లో భారీ వర్షపాతం కురుస్తున్నాయి. అమర్‌పూర్ స్టేషన్ ద్వైపాక్షిక ప్రోటోకాల్‌లో భాగంగా, దీని ప్రకారం బంగ్లాదేశ్‌కు నీటి ఉద్ధృతి గురించిన సమాచారాన్ని పంపుతున్నాము" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెరుగుతున్న ట్రెండ్‌ను చూపించే డేటాను ఆగస్టు 21, 2024న 1500 గంటల వరకు బంగ్లాదేశ్‌కు అందించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. వరదల కారణంగా ఏర్పడిన విద్యుత్ అంతరాయం వల్ల సమాచార పంపిణీలో సమస్యలు ఏర్పడ్డాయి. ఇతర మార్గాల్లో కమ్యూనికేషన్ కొనసాగించేందుకు మేం ప్రయత్నించాం'' అని విదేశాంగ శాఖ పేర్కొంది.
వరదల సమస్య పరిష్కరించడానికి పరస్పర సహకారం అవసరం
భారత్ -బంగ్లాదేశ్ మధ్య నదులలో వరదలు ఒక సాధారణ సమస్య అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీని వలన ఇరువైపులా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దీనిని పరిష్కరించడానికి పరస్పర సహకారం అవసరం అని తెలిపింది. రెండు దేశాలు 54 ఉమ్మడి సరిహద్దు నదులను పంచుకుంటున్నందున, నదీ జలాల సహకారం మన ద్వైపాక్షిక అగ్రిమెంట్ లో ముఖ్యమైన భాగం. ద్వైపాక్షిక సంప్రదింపులు, సాంకేతిక చర్చల ద్వారా నీటి వనరులు, నదీ జలాల నిర్వహణలో సమస్యలు, పరస్పర ఆందోళనలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నామని విదేశాంగ శాఖ పేర్కొంది.