
Bathukamma celebrations: ఓనం రికార్డును అధిగమించేందుకు బతుకమ్మ వేడుకలు సిద్ధం.. లక్షలాది మహిళలతో కొత్త చరిత్ర
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ ఉత్సవాలకు పూర్తిగా సిద్ధమవుతోంది. ఈసారి బతుకమ్మ వేడుకలు సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం డే సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరుసటి రోజు సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు స్థాయి బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో సుమారు 11 లక్షల మంది మహిళలు పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా స్వయం సహాయక బృందాల మహిళలతో ఈ బతుకమ్మ ఉత్సవాలను ప్రత్యేకంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Details
11 లక్షల బతుకమ్మ చీరలతో వరల్డ్ రికార్డు ప్రణాళిక
ఇందుకోసం జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగం ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది. ప్రభుత్వం 11 లక్షల బతుకమ్మ చీరలను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు ప్రత్యేక ఇన్‌చార్జీలను నియమించనుంది. కేరళలో జరిగే ఓనం వేడుకల తరహాలోనే, ఆ రికార్డును అధిగమించేలా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది.
Details
కార్యక్రమాల షెడ్యూల్
సెప్టెంబర్ 27: సాయంత్రం ట్యాంక్‌బండ్ వద్ద బతుకమ్మ కార్నివాల్ సెప్టెంబర్ 28: ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు స్థాయి బతుకమ్మ కార్యక్రమం సెప్టెంబర్ 29: పీపుల్స్ ప్లాజా వద్ద ఉత్తమ బతుకమ్మ పోటీ సెప్టెంబర్ 29: ఐటీ ఎంప్లాయీల రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల బతుకమ్మ పోటీ సెప్టెంబర్ 30: ట్యాంక్‌బండ్ వద్ద గ్రాండ్ పూల పండగ