
BC Reservations: బీసీ రిజర్వేషన్ల వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించగా, సోమవారం సుప్రీంకోర్టులో కేసును దాఖలు చేయనుంది. హైకోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత, సీఎం రేవంత్‌రెడ్డి సీనియర్ కౌన్సిల్‌ల సామంతో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని నిర్ణయించారు. అభిషేక్ మను సింగ్వి, సిద్ధార్థ దవే వంటి రిజర్వేషన్లపై ప్రావీణ్యం కలిగిన అడ్వకేట్‌లతో వాదనలు జరగనున్నాయని సమాచారం.
Details
తదుపరి విచారణ 4 వారాల పాటు వాయిదా
హైకోర్టు జీవో 9 పై స్టే విధిస్తూ, పిటిషనర్లు 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని, ప్రభుత్వం 4 వారాల్లో కౌంటర్ సమర్పించాలంటూ ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. తాజా ఆర్డర్ ప్రకారం, జీఓ 9, 41, 42 లపై హైకోర్టు స్టే విధించింది. అలాగే ట్రిపుల్ టెస్టు పాటించకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లకు మించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 3కు వాయిదా వేసింది. వికాస్ కృష్టా రావు గవాలి, రాహుల్ రమేష్ వాగ్ కేసులపై సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది.