Page Loader
తలైవా ర‌జినీకాంత్‌కు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్.. దీంతో ఏమేం చేయొచ్చో తెలుసా
దీంతో ఏమేం చేయొచ్చో తెలుసా

తలైవా ర‌జినీకాంత్‌కు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్.. దీంతో ఏమేం చేయొచ్చో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 19, 2023
07:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

తలైవా ర‌జినీకాంత్‌కు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్ అందించింది. ఈ మేరకు సెక్రటరీ జైషా స్వయంగా సూపర్ స్టార్ ను కలిసి అందజేశారు. చ‌రిష్మా ఉన్న రజనీకాంత్‌ దిగ్గ‌జ నటుడని, భాష, సంస్కృతులకు అతీతంగా కోట్లాది మంది హృద‌యాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని షా కొనియాడారు. ప్ర‌పంచ‌క‌ప్‌కు విశిష్ట అతిథిగా తమ ఆహ్వానాన్ని మన్నిస్తారని, ఈ క్రమంలోనే మ్యాచులకు హాజరై క్రికెట్ అభిమానులను మరింత అలరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. గోల్డెన్ టిక్కెట్ అంటే ఏమిటో తెలుసా : గోల్డెన్‌ టిక్కెట్ ఉంటే ప్ర‌పంచ‌క‌ప్- 2023లోని అన్ని మ్యాచుల‌ను వీఐపీ స్టాండ్ నుంచి ఉచితంగా చూసే వెసులుబాటు ఉంటుంది. తొలి టిక్కెట్ ను అమితాబ్ బ‌చ్చ‌న్‌, మలి టిక్కెట్ స‌చిన్ టెండూల్క‌ర్‌, తర్వాత రజినీకి అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్వయంగా రజినీకాంత్ ను కలిసి గోల్డెన్ టిక్కెట్ అందజేసిన జైషా