Page Loader
Heat Wave: బయటకు వెళ్లే ముందు జాగ్రత్త.. నేడు ఏపీలో తీవ్ర వడగాలులు!
బయటకు వెళ్లే ముందు జాగ్రత్త.. నేడు ఏపీలో తీవ్ర వడగాలులు!

Heat Wave: బయటకు వెళ్లే ముందు జాగ్రత్త.. నేడు ఏపీలో తీవ్ర వడగాలులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా నేడు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రజల మొబైళ్లకు అప్రమత్త సంకేతాన్ని పంపుతోంది. ఈ మెసేజ్‌ను ఓకే బటన్ నొక్కేవరకు ఫోన్ మోగేలా ఏర్పాటు చేసింది. ప్రజలు ఎండకు ఎక్కువగా గురికాకుండా ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు ఎక్కువగా నీరు, మజ్జిగ, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరి నీరు, ఓఆర్‌ఎస్‌ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచిస్తూ హెచ్చరిక సందేశాన్ని పంపించారు.