Page Loader
జీ20 సమ్మిట్‌ ముంగిట.. యూరప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ 
జీ20 సమ్మిట్‌ ముంగిట.. యూరప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ

జీ20 సమ్మిట్‌ ముంగిట.. యూరప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ 

వ్రాసిన వారు Stalin
Sep 06, 2023
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారం రోజుల పర్యటన నిమిత్త యూరప్‌కు బయలుదేరారు. భారత్ ప్రతిష్టాత్మకమైన జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇస్తున్న వేళ.. రాహుల్ యూరప్‌ పర్యటనకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ తన పర్యటనలో భాగంగా యూరోపియన్ యూనియన్ లాయర్లు, విద్యార్థులు, భారతీయ ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. సెప్టెంబరు 7న బ్రస్సెల్స్‌లో ఈయూ న్యాయవాదుల బృందాన్ని రాహుల్ కలుస్తారని, హేగ్‌లో కూడా మరో సమావేశంలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 8న పారిస్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించనున్నారు.

రాహుల్

సెప్టెంబరు 11న దిల్లీకి తిరిగి వచ్చే అవకాశం

సెప్టెంబరు 9న పారిస్‌లో జరిగే లేబర్ యూనియన్ ఆఫ్ ఫ్రాన్స్ సమావేశంలోనూ రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. ఆ తర్వాత నార్వేలో పర్యటించి, సెప్టెంబర్ 10న ఓస్లోలో జరిగే డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొననున్నారు. జీ20 సమ్మిట్ ముగిసిన ఒక రోజు తర్వాత అంటే సెప్టెంబర్ 11 నాటికి రాహుల్ గాంధీ దిల్లీకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలో జీ20 లీడర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు 30 మందికి పైగా దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్ ఆహ్వానిత దేశాల నుంచి ఉన్నతాధికారులు, 14 మంది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు.