అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభం.. నేటి నుంచి 22వరకు ఏ రోజున ఏం చేస్తారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సహన్నాహాలు ప్రారంభయ్యాయి.
శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు మంగళవారం ఉదయం 09:30 గంటలకు మొదలయ్యాయి.
ఈ ఘట్టంలో ముందుగా ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. దాదాపు 5 గంటల పాటు ఏకధాటిగా తొలిరోజు పూజలు జరగనున్నాయి.
'ప్రాణ్‌ప్రతిష్ఠ' వేడుక నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల అనుష్ఠానం (ప్రత్యేక ఆచారం) చేపట్టిన విషయం తెలిసిందే.
రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు మొత్తం గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ పర్యవేక్షణలో జరుగుతాయి.
కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షితులు ఈ మహా కార్యానికి ప్రధాన ఆచార్యగా ఉంటారు.
అయోధ్య
16 నుంచి 22 వరకు.. ఏ రోజున ఏం చేస్తారో తెలుసుకుందాం
జనవరి 16న పూజలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సరయూ నది ఒడ్డున క్రతువు పూజలు ఉంటాయి.
జనవరి 17న శ్రీరాముడి విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుంది. వేద మంత్రోచ్ఛరణలతో గర్భగుడి శుద్ధి చేస్తారు.
జనవరి 18నుంచి గర్భగుడిలోనే శ్రీరాముడి విగ్రహం ఉంటుంది. జలపూజ, గణేష్ అంబికా పూజ, వాస్తు పూజ, మాతృక పూజలు చేస్తారు.
జనవరి 19వ తేదీ ఉదయం రామాలయంలో యాగ అగ్నిగుండం ఏర్పాటు చేస్తారు.
జనవరి 20న గర్భగుడిని పవిత్ర సరయూ నది నీటితో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత చక్రస్నానం, పండ్లు, పుష్పాలతో అభిషేకాలు ఉంటాయి.
జనవరి 21న శ్రీరాముడి విగ్రహానికి 125కలశాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు.
జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుంది.