Page Loader
అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే నిజాలు.. దిల్లీలో మాయ గ్యాంగ్ అలజడులు
అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే నిజాలు.. చెంపదెబ్బ కొట్టినందుకే ఫైరింగ్

అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే నిజాలు.. దిల్లీలో మాయ గ్యాంగ్ అలజడులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 31, 2023
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే విషయాలు బహిర్గతమవుతున్నాయి. ఇటీవలే 18 ఏటాలోకి అడుగుపెట్టిన ఓ యువకుడు, మాయ, అతని గ్యాంగ్, మేనేజర్ హర్‌ప్రీత్‌ గిల్‌ను దారుణంగా పొట్టనబెట్టుకున్నారు. ఇప్పటికే వీరంతా పలు కేసుల్లో నేరస్థులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహమ్మద్ సమీర్ అలియాస్ మాయ పేరిట 4 హత్య కేసులున్నాయి.ఈ మేరకు బాల నేరస్థునిగా శిక్షను అనుభవిస్తున్నాడు. అతని ఇన్‌స్టాలో తుపాకీలకు పోజులివ్వడం, కాల్చడం లాంటి ఫొటోలు ఉండటం గమనార్హం. ఈ కేసులో మొత్తం 4 నిందితులుండగా, ప్రధాన నేరస్తుడు మాయ అరెస్టయ్యారు.బిలాల్ గని హత్య, దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. సోహైల్(23),మహ్మద్ జునైద్ (23),అద్నాన్ (19)లతో కలిసి నార్త్ ఈస్ట్ దిల్లీలో మాయ గ్యాంగ్ ఏర్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాన నిందితుడు మాయ అలియాస్ మహమ్మద్ సమీర్ అరెస్ట్