Bengaluru Metro: మెట్రో రైలులో యువ జంట అసభ్య చేష్టలు.. వీడియో తీసి మెట్రో అధికారులకు ట్వీట్ చేసిన ప్రయాణికుడు
బెంగళూరు మెట్రో రైలులో ఓ యువ జంట అభ్యంతరకరంగా ప్రవర్తించారు. చుట్టూ జనం ఉన్నా పట్టించుకోకుండా ప్రేమ మైకంలో తేలిపోయారు. ఒకరినొకరు హత్తుకుంటూ,ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. ఢిల్లీ మెట్రో రైలులో యువ జంటలు రెచ్చిపోవడం.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం నిన్నమొన్నటి సంగతి. ఇప్పుడు ఈ పైత్యం బెంగళూరుకు పాకింది బెంగుళూరులో వీరి వ్యవహారం చూసి చిర్రెత్తిపోయిన తోటి ప్రయాణికుడు ఒకరు ఈ తతంగాన్నంతా తన ఫోన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. బెంగళూరు మెట్రో అధికారులతో పాటు పోలీసులకు ట్యాగ్ చేసి ఆ యువ జంటపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
మెట్రో స్టేషన్ లిఫ్ట్ లో కూడా ప్రేమికుల ముద్దులాట
మొన్నామధ్య హైదారాబాద్ మెట్రో స్టేషన్ లిఫ్ట్ లో కూడా ప్రేమికుల ముద్దులాటల వీడియోలు బైటికి వచ్చాయి. అనేక మెట్రో స్టేషన్లలోని లిఫ్టుల్లో ఇటీవల యువ జంటలు కామకలాపాలతో రెచ్చిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బయటకొచ్చిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇప్పుడు మళ్ళీ బెంగుళూరులో ఈ వెర్రిని ఒక వ్యక్తి రికార్డు చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ పై పోలీస్ అధికారులు స్పందించారు. ఆ యువ జంటను గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మెట్రోలోని ప్రతి ప్రదేశం సీసీ కెమెరా నిఘాలో ఉంటుంది. అయినా యువత ఇలా చేయడం బాధాకరం.