బెంగళూరులో కనీవినీ ఎరుగని ట్రాఫిక్.. రాత్రికి ఇంటికి చేరిన పాఠశాల విద్యార్థులు
కర్ణాటక రాజధాని బెంగళూరును ట్రాఫిక్ ముంచెత్తింది. బుధవారం అసాధారణంగా పెరిగిన ట్రాఫిక్ మహానగర ప్రజలను తీవ్ర అసౌకర్యాల పాలు చేసింది. ఒక దశలో ట్రాఫిక్ కారణంగా బడి పిల్లలను, పాఠశాల బస్సు రాత్రి 8 గంటలకు ఇళ్లలో దిగబెట్టింది. వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో కేవలం కిలోమీటరు ప్రయాణం కోసం రెండు గంటల సమయం పట్టింది. దీంతో వేలాది వాహనాలు గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయాయి.ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ప్రాంతం భారీ ట్రాఫిక్ కారణంగా ఐదు గంటలకుపైగా రోడ్లపైనే ఉండిపోయారు. కర్ణాటక జలసంరక్షణ సమితి బెంగళూరు బంద్ కు పిలుపునిచ్చిన మరుసటి రోజు ట్రాఫిక్ బీభత్సంగా మారింది. మరోవైపు గణేష్ నిమజ్జన ఊరేగింపులతో ట్రాఫిక్ మరింత ఏర్పడింది.
దాదాపు 4 గంటల పాటు భారీగా నిలిచిపోయిన వాహనాలు
Bengaluru's tech hub, ORR, faced an unprecedented traffic jam, trapping techies, office-goers, and school buses for almost 4 hours. The Baiyappanahalli-KR Pura metro link, could have eased this, but the State Govt's inaction, despite CMRS approval, prolongs the suffering. pic.twitter.com/LJEelVPRIU— P C Mohan (@PCMohanMP) September 27, 2023