Bangalore: టెక్కీ అదృశ్యం.. సోషల్ మీడియాను అశ్రయించిన భార్య
ఇంటి నుంచి వెళ్లి ఓ టెక్కీ కొన్ని రోజులుగా మళ్లీ ఇంటికి చేరుకోలేదు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. మన్యతా టెక్ పార్క్ లోని ఓ సంస్థలో పనిచేస్తున్న విపిన్ గుప్త ఆగస్టు 4న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ఛాఫ్ చేయబడిందని అతని భార్య శ్రీపర్ణ పేర్కొంది. అతను వెళ్లిన కాసేపటికే బ్యాంకులో నుంచి రూ. 1.8 లక్షలు నగదు విత్ డ్రా అయిందని తెలిపారు. ఈ ఘటనపై ఆమె 'ఎక్స్' ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అధికారులను వేడుకున్న శ్రీపర్ణ
విపిన్ గుప్తా భార్య, పిల్లలతో కలిసి మూడేళ్ల నుంచి కొడిగేహళ్లి టాటా నగర్‌లో ఉంటున్నారు. ఆగస్టు 6న తన భర్త కనిపించడం లేదని స్థానిక కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జాప్యం చేయడంతో ఎక్స్ ద్వారా ఆమె ఉన్నతాధికారులకు పిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. తన భర్తకు ఎలాంటి వ్యసనాలు లేవని, తమ వైవాహిక జీవితంలో ఎలాంటి విభేదాలు లేవని పేర్కొంది. తన భర్త ఎప్పుడూ మద్యం సేవించలేదని, తమకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవన్నారు. వెంటనే అధికారులు స్పందించి, తన భర్త అచూకీని కనిపెట్టాలని శ్రీపర్ణ వేడుకున్నాడు.