Bengaluru Rains: భారీ వర్షాలతో బెంగళూరు జలమయం
బెంగళూరులో సోమవారం అర్ధరాత్రి నుండి తెల్లవారుజామువరకు అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యారు. ఈ నేపథ్యంలో యలహంక కేంద్రీయ విహార్ ప్రాంతంలో అలారం వ్యవస్థ ఉన్న కార్లన్నీ ఒక్కసారిగా మోగడం ప్రారంభమైంది. సెల్లార్ లేని భవంతుల్లో దిగువ అంతస్తుల్లో ఉన్న వ్యక్తులు అప్రమత్తమవడానికి ముందే వరద చుట్టుముట్టింది. కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
భారీ వర్షాలకు కూలిన భవనం
మంగళవారం ఉదయం, అక్కడి వాసులను యుద్ధ ప్రాతిపదికన అధికారులు బయటికి తీసుకొచ్చారు. ఇక, బెంగళూరులోని కీలక ప్రాంతమైన బాబూసాపాళ్యలో నిర్మాణంలో ఉన్న ఒక భవంతి మంగళవారం సాయంత్రం భారీ వర్షాల కారణంగా కూలిపోయింది. ఆ భవంతి అవశేషాల కింద కార్మికులు ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అగ్నిమాపక దళం, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది శిథిలాలను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నారు.