Train Accident: భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన.. పలు రైళ్లు రద్దు
తమిళనాడులో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్ళాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) రైలు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో వేగంగా వెళ్లి నిలిచివున్న గూడ్స్ రైలును ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రైలు 13 బోగీలు పట్టాలు తప్పపడంతో భారీ నష్టం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి దక్షిణ రైల్వే చర్యలు తీసుకుంది
ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
పలు రైళ్లను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. రద్దు అయిన రైళ్లలో తిరుపతి-పుదుచ్చేరి మెము, పుదుచ్చేరి-తిరుపతి మెము, డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-తిరుపతి ఎక్స్‌ప్రెస్, తిరుపతి-డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, అరక్కం-పుదుచ్చేరి మెము, కడప-అరక్కోణం మెము, చెన్నై సెంట్రల్-తిరుపతి మెము, అరక్కోణం-తిరుపతి మెము, విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్‌ప్రెస్, సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఈ రైలు రద్దుల కారణంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.