
Bharat Bandh:రేపు భారత్ బంద్ బంద్‌కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు.. బంద్‌కు కారణమిదే
ఈ వార్తాకథనం ఏంటి
రేపు అనగా జులై 9 బుధవారం నాడు భారత్ బంద్ . దేశంలోని ప్రముఖ కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ బంద్‌ను నిర్వహించేందుకు ఐక్యవేదికగా ముందుకొచ్చాయి. బంద్‌ను తప్పకుండా పాటించాల్సిందిగా ప్రజలకు, కార్మికులకు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బంద్ నేపథ్యంలో భద్రతా చర్యలుగా పోలీసు దళాలను భారీగా మోహరించారు. బంద్ విజయవంతం కాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే బంద్ ఎందుకంటే..
వివరాలు
బంద్‌కు అసలు కారణం ఏమిటంటే...
కేంద్రం అమలు చేస్తున్న కార్మికులూ, రైతులూ వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల దృక్పథాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఈ బంద్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా బుధవారం రోజున భారీ స్థాయిలో సమ్మెతో పాటు భారత్ బంద్‌ను నిర్వహించనున్నారు. దాదాపు 25 కోట్ల మందికి పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. పది ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇందులో ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగాల్లో పనిచేసే ఉద్యోగులు భాగస్వాములవుతారు. అధికారిక, అనధికారిక రంగాలకు చెందిన కార్మికులంతా ఈ సమ్మెలో పాల్గొంటారని ట్రేడ్ యూనియన్లు స్పష్టం చేశాయి. సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు నినాదం చేస్తున్నాయి.
వివరాలు
ఎందుకు బంద్‌కు పిలుపునిచ్చారు?
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత అమర్జిత్ కౌర్ తెలిపిన మేరకు, దాదాపు 25 కోట్ల మంది కార్మికులు బంద్‌లో పాల్గొంటారని అంచనా. అంతేకాకుండా రైతులు, గ్రామీణ ప్రాంతాల కార్మికులు కూడా ఈ నిరసనల్లో భాగమవుతారని వెల్లడించారు. బ్యాంకింగ్, బీమా, పోస్టల్, బొగ్గు గనులు, రహదారులు, నిర్మాణ రంగాల కార్మికులు ఈ బంద్‌లో పాల్గొంటారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఈ రంగాల్లో కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశముందని ట్రేడ్ యూనియన్లు పేర్కొన్నాయి. ప్రజలు ముందస్తుగా ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
వివరాలు
బంద్‌కు దారితీసిన ప్రధాన కారణాలు ఇవే:
గత దశాబ్దంగా వార్షిక కార్మిక సదస్సు నిర్వహించకపోవడం. నూతన కార్మిక కోడ్‌ల ద్వారా కార్మిక సంఘాల ప్రభావాన్ని తగ్గించే విధానాలు. పని గంటలు పెంచడం, కార్మికుల హక్కులను తగ్గించడం. ప్రైవేటీకరణను ప్రోత్సహించడం, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల మోతాదును పెంచడం. ఉద్యోగ నియామకాలపై, వేతనాల పెంపుపై ప్రభుత్వ నిర్లక్ష్యం. నిరుద్యోగిత సమస్యను పరిష్కరించేందుకు సరైన చర్యలు లేకుండా, కేవలం ఉద్యోగదాతలకు మద్దతుగా 'ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్' పథకాలను అమలు చేయడం.
వివరాలు
బంద్ పిలుపునిచ్చిన యూనియన్లు:
ఈ భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలలో ఏఐటీయూసీ (AITUC), హెచ్ఎంఎస్ (HMS), సీఐటీయూ (CITU), ఐఎన్‌టీయూసీ (INTUC), ఏఐయూటీయూసీ (AIUTUC), టీయూసీసీ (TUCC), ఎస్ఈడబ్ల్యూఏ (SEWA)తో పాటు మరిన్ని సంఘాలు ఉన్నాయి. ఈ సమ్మె ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా నిర్వహించబోయే అతిపెద్ద కార్మిక పోరాటాలలో ఒకటిగా చరిత్రలో నిలిచే అవకాశం ఉంది.