
Census 2027: ఇకపై పౌరులే వెబ్ పోర్టల్ ద్వారా నేరుగా జన, కుల గణన నమోదు చేసుకోవచ్చు!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జనగణన విధానం కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. దేశవ్యాప్తంగా జరగనున్న రాబోయే జనగణనలో కేంద్ర ప్రభుత్వం తొలి సారిగా డిజిటల్ ప్రక్రియను ప్రవేశపెట్టనుంది. ఈ సాంకేతిక పరివర్తనతో పౌరులు తమ వివరాలను ఇంటి నుంచే ఒక ప్రత్యేక వెబ్‌పోర్టల్ ద్వారా నమోదు చేసుకునే వీలును కల్పిస్తున్నారు. ఈ మార్పు ద్వారా జనగణన మరింత సులభంగా,పారదర్శకంగా మారనుంది. ఈ డిజిటల్ జనగణన ప్రక్రియను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి దశలో గృహ జాబితా,గృహ గణన (హౌసింగ్ సెంసస్)కార్యక్రమం జరుగుతుంది. ఇందులో నివాస స్థితి,అందుబాటులో ఉన్న సౌకర్యాలు,ఆస్తుల వివరాలు వంటి ముఖ్యమైన సమాచారం సేకరిస్తారు. తరువాతి దశలో సాధారణ జనగణన నిర్వహించనున్నారు.ఈసారి సాంప్రదాయ పద్ధతులకు బదులుగా,అధికారులైన ఎన్యూమరేటర్లు మొబైల్ అప్లికేషన్లను వినియోగించనున్నారు.
వివరాలు
డిజిటల్ మార్పు వల్ల ప్రక్రియ మరింత సమర్థవంతంగా, వేగంగా,క్రమబద్ధంగా జరుగుతుంది
ఈ మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా అధికారులు తమ సెల్‌ఫోన్‌లలో పౌరుల సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు. ఈ డిజిటల్ మార్పు వల్ల జనగణన ప్రక్రియ మరింత సమర్థవంతంగా, వేగంగా,క్రమబద్ధంగా జరుగుతుంది. పౌరులకు సేవలు అందుబాటులోకి త్వరగా రావడం తో పాటు,సమాచారం సేకరణలో తప్పులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అదే విధంగా,డేటాను విశ్లేషించడం,నివేదికలు తయారుచేయడం కూడా త్వరగా పూర్తి చేయవచ్చు. పౌరులు తమ సమాచారం స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉండటం వల్ల సమచారం మరింత ఖచ్చితంగా ఉండే అవకాశముంది. దీనితో పాటు వనరుల వినియోగం కూడా సమర్థవంతంగా జరుగుతుంది.భారతదేశం లాంటి విస్తృతమైన జనాభా కలిగిన దేశంలో జనగణన ఒక పెద్ద కార్యచరణ.
వివరాలు
జనగణనలో కుల గణన కూడా...
ఈ ప్రక్రియను ఆధునిక సాంకేతికతతో కలిపితే, ప్రభుత్వానికి మెరుగైన ప్రణాళికలు రూపొందించడానికి, ప్రజల సంక్షేమానికి అనుగుణంగా పథకాలను అమలు చేయడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం,ఈ డిజిటల్ జనగణన భారత భవిష్యత్తుకు శక్తివంతమైన పునాదిగా నిలవనుంది. భవిష్యత్తులో జరగబోయే జనగణనలో కుల గణనను కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేంద్ర కమిటీ సమావేశంలో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. త్వరలో జనగణన ప్రక్రియ ప్రారంభం కానున్నదని చెప్పారు.
వివరాలు
జనగణనలో కుల గణన కూడా...
అలాగే, ఈసారి కులాల గణన కూడా జరగనుందని స్పష్టం చేశారు. కుల గణన ద్వారా దేశంలో ఏ కులానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారన్న స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ఇది ప్రభుత్వ పథకాలను సమానంగా అందించడంలో ఎంతో సహాయపడుతుందని చెప్పారు. కులాల మధ్య సమానత్వాన్ని నెలకొల్పేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.