
Bharat Bandh : రేపు భారత్ బంద్.. పిలుపునిచ్చిన మావోయిస్టులు
ఈ వార్తాకథనం ఏంటి
మావోయిస్టులు(Maoists) రేపు భారత్ బంద్(Bharat Bandh)కు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో భదాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు.
తెలంగాణ, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో భద్రత బలగాలు కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలోని వీరాపురం దగ్గర వాహనాలపై మావోయిస్టులు దాడి చేసి కార్లకు నిప్పింటించారు.
ఈనెల 22న భారత్ బంద్ పిలుపుని విజయవంతం చేయాలంటూ మావోయిస్టులు కరపత్రాలను వదిలి వెళ్లారు.
నిన్న పోలీసులు, మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది.
Details
మావోయిస్టులపై డిమాండ్ పై ఎలాంటి సమాచారం లేదన్న పోలీసులు
దీనికి నిరసనగా రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలిసింది.
చత్తీస్ ఘడ్‌లో మావోయిస్టులకు- పోలీసులకు మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి.
సుక్మా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దండకారణ్యంలో మావోయిస్ట్ బేస్ క్యాంపులను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి.
ఈ దాడుల్లో పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఈ క్రమంలో జరిగిన దాడుల్లో ఎనిమది మంది మావోయిస్టులు మరణించారు.
అయితే మావోయిస్టుల డిమాండ్స్ పై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు