Page Loader
BharatPe : ఇండియాలో ఏం జరుగుతోంది.. విమానాశ్రయంలో అష్నీర్ గ్రోవర్ దంపతుల నిలిపివేత
BharatPe : ఇండియాలో ఏం జరుగుతోంది.. విమానాశ్రయంలో అష్నీర్ గ్రోవర్ దంపతుల నిలిపివేత

BharatPe : ఇండియాలో ఏం జరుగుతోంది.. విమానాశ్రయంలో అష్నీర్ గ్రోవర్ దంపతుల నిలిపివేత

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 17, 2023
06:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌పే మోసం కేసులో అష్నీర్ గ్రోవర్ వివాదం ముదురుతోంది. ఈ మేరకు ఫిన్‌టెక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కి దిల్లీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఈ క్రమంలోనే అష్నీర్ గ్రోవర్ అతని భార్య మాధురీ జైన్, దిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళ్లేందుకు ఏయిర్ పోర్టుకు వచ్చారు. దీంతో వారు దేశం విడిచి వెళ్లకుండా అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ఈ దంపతుల ప్రయాణాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఈ వివాదంపై గ్రోవర్ ట్వీట్ చేశారు. తనకు ఎఫ్ఐఆర్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని నెట్టింట రాసుకొచ్చారు.దిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం(EOW) అష్నీర్ గ్రోవర్, మాధురీ జైన్‌పై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండియాలో ఏం జరుగుతోందని అని నిలదీస్తున్న అష్నీర్ గ్రోవర్