
Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి బాధ్యతలను స్వీకరించారు.
శ్రీవారం ఆలయం గరుడాళ్వార్ సన్నిథిలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. రెండేళ్ల పాటు భూమన టీటీడీ ఛైర్మన్‌గా సేవలందించనున్నారు.
శ్రీవారి ఆలయంలో ఉదయం 11: 44 గంటలకు టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 12.30 గంటలకు అన్నమయ్య భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకూ తితిదే ఛైర్మన్‌గా కొనసాగిన వైవీ సుబ్బారెడ్డితో పాటు బోర్డు పదవీ కాలం ఈనెల 8తో ముగిసింది.
Details
తిరుపతి పట్టణంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు
భూమన గతంలోనూ 2006 నుంచి 2008 వరకు టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో భూమన కరుణాకర్ రెడ్డి జన్మించాడు.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆయన ఎంఏ చదివారు.
గతంలో పేద వధూవరుల కోసం కల్యాణమస్తు, వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణాలు చేయించేందుకు దళిత గోవిందం వంటి కార్యక్రమాలను ఆయన చేశారు.
భూమన బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో తిరుపతి పట్టణంలో అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.