Supreme Court : 8మంది పాపులర్ ఫ్రంట్ ఇండియా సభ్యులకు బెయిల్ రద్దు
నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఇండియాకి సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పాపులర్ ఫ్రంట్ ఇండియా పేరుతో తమిళనాడులో కొంత కాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాగా మదర్సాల ముసుగులో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతుందనే ఆరోపణలు పీఎఫ్‌ఐపై చాలా కాలంగా ఉన్నాయి. ఈ మేరకు 2003లో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను అత్యున్నత న్యాయస్ధానం కొట్టి పడేసింది. జాతీయ దర్యాప్తు సంస్ధ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలను సమర్పించలేదని జస్టిస్ బేలా త్రివేదీ అభిప్రాయపడ్డారు. దేశ భద్రత ఎప్పుడూ ప్రధానమని కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
కోర్టు బెయిల్ రద్దుపై ఏం చెప్పింది?
హింసాత్మకమైనా, అహింసాత్మకమైనా ఉగ్రవాద ఘటనలను నిషేధించవచ్చని కోర్టు పేర్కొంది. పీఎఫ్‌ఐకి చెందిన ఎనిమిది మంది సభ్యులు దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ ఎనిమిది మంది సభ్యుల పేర్లు.. బరాకతుల్లా,అహ్మద్ ఇద్రిస్,ఖలీద్ మహమ్మద్,సయీద్ ఇషాక్, ఖ్వాజా మౌహెయుద్దీన్,యాసిర్ అరాఫత్,ఫయాజ్ అహ్మద్,మహ్మద్ అబ్బుతాహిర్. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ బేల ఎం త్రివేది వెకేషన్ బెంచ్ రద్దు చేసింది. నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గరిష్టంగా ఏడాదిన్నర పాటు జైలులో గడిపారని బెంచ్ పేర్కొంది. అయినా నేర తీవ్రత దృష్ట్యా బెయిల్ ను రద్దు చేస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది.. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జాతీయ దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
2022 లోనే 8 సంస్థలపై నిషేధం
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA)అప్పీల్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు, NIA కోర్టు ముందు ఉంచిన అంశాల ఆధారంగా, ప్రాథమిక కేసును రూపొందించినట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2022లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను ఐదేళ్ల పాటు నిషేధించింది. పీఎఫ్‌ఐతో పాటు దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న మరో 8 సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వాస్తవానికి, NIA, ED, రాష్ట్ర పోలీసులు సెప్టెంబర్ 2022లో ఏడు రాష్ట్రాల్లో దాడుల్లో PFIకి సంబంధించిన 200 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. పిఎఫ్‌ఐకి వ్యతిరేకంగా ఏజెన్సీలు తగిన సాక్ష్యాలను కనుగొన్నాయి. ఆ తర్వాత ఆ సంస్థలను నిషేధించారు.