
Kunal Kamra: కునాల్ కమ్రాకు బిగ్ షాక్.. బుక్ మై షో జాబితా నుంచి తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు అనుకోని షాక్ తగిలింది. ప్రముఖ టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షో ఆయనను తమ ప్లాట్‌ఫారమ్‌పై కళాకారుల జాబితా నుంచి తొలగించింది.
శివసేన కార్యకర్త రాహుల్ కునాల్ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం బుక్ మై షో శుద్ధమైన వేదికగా మారిందని, కునాల్ కమ్రాను వినోద విభాగం నుంచి తొలగించినందుకు సంస్థ సీఈవో ఆశిష్ హేమరాజనికి కృతజ్ఞతలు తెలిపారు.
బుక్ మై షో బృందాన్ని సంప్రదించగా, ప్రస్తుతం వారి పోర్టల్‌లో కునాల్ కమ్రా వీడియోలు లేవని, అలాగే భవిష్యత్‌లో కూడా ఆయనకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్‌లు ఉండవని స్పష్టం చేశారంటూ రాహుల్ పేర్కొన్నారు.
Details
సమన్లు పంపినా హాజరుకాని కునాల్ కమ్రా
శాంతిని కాపాడటంలో ప్రజల భావోద్వేగాలను గౌరవించడంలో బుక్ మై షో కీలకంగా వ్యవహరించిందని ఆయన ప్రశంసించారు.
ఇది ఇలా ఉంటే, ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
షిండేను ఉద్దేశించి 'ద్రోహి'గా అభివర్ణించిన కునాల్ వ్యాఖ్యలతో శివసేన కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాలలు రగిలాయి.
ఫలితంగా కునాల్ కార్యక్రమం నిర్వహించిన క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడికి దిగారు.
అలాగే పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు కూడా చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో ముంబై పోలీసులు రెండు సార్లు సమన్లు పంపినా, కునాల్ కమ్రా హాజరుకాలేదు.
Details
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు
ఆయన షిండేపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే న్యాయస్థానం కోరితే క్షమాపణ చెబుతానని తెలిపారు. ప్రస్తుతం కునాల్ కమ్రా పుదుచ్చేరిలో ఉన్నట్లు సమాచారం. ఈ వివాదంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా రంగంలోకి దిగారు. కునాల్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయనకు మద్దతు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియా వేదికగా విస్తరించడంతో, కునాల్ కమ్రా పేరు మరోసారి వార్తలలో నిలిచింది.