Nehru Zoo Park Ticket Price: పర్యాటకులకు బిగ్ షాక్.. హైదరాబాద్ జూపార్క్‌లో టికెట్, పార్కింగ్ ఛార్జీల పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్ సందర్శకులకు భారీ షాక్ ఎదురైంది. ప్రభుత్వం అన్ని రకాల టికెట్ ధరలను పెంచింది.
మంగళవారం జరిగిన జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 1వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు జూపార్క్ క్యూరేటర్ వసంత ప్రకటించారు.
ఎంట్రీ ఫీజు కొత్త రేట్లు
మార్చి 1వ తేదీ నుంచి పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 టికెట్ ధరగా నిర్ణయించారు.
గతంలో పెద్దలకు రూ.70, పిల్లలకు రూ.45 మాత్రమే ఉండేది.
Details
ఫోటోగ్రఫీ, షూటింగ్ ఛార్జీలు
ఫోటో కెమెరా అనుమతి - రూ.150 - ప్రొఫెషనల్ వీడియో కెమెరా - రూ.2500, కమర్షియల్ మూవీ షూటింగ్ - రూ.10,000
రైడ్ ఛార్జీలు
ట్రైన్ రైడ్ (20 నిమిషాలు) - పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40
బ్యాటరీ ఆపరేటెడ్ రైడ్ - పెద్దలకు రూ.120, పిల్లలకు రూ.70
పార్కింగ్ ఫీజు పెంపు
సైకిల్-రూ.10, బైక్-రూ.30, ఆటో - రూ.80, కారు/జీప్ - రూ.100, టెంపో/తూఫాన్ - రూ.150,
21 సీట్లు గల మినీ బస్సు - రూ.200, 21 సీట్లు పైబడి ఉన్న బస్సు - రూ.300
కొత్త రేట్లు అమల్లోకి రాగానే, నెహ్రూ జూపార్క్‌ను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులపై పెరిగిన చార్జీలు ప్రభావం చూపే అవకాశం ఉంది.