Page Loader
Bihar: బీహార్‌లో దారుణం.. నవాడాలో 25 ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు 
బీహార్‌లో దారుణం.. నవాడాలో 25 ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు

Bihar: బీహార్‌లో దారుణం.. నవాడాలో 25 ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2024
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో ఘోర ఘటన జరిగింది. నవాడా పట్టణం ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కృష్ణానగర్‌లో దాదాపు 20-25 ఇళ్లను గుర్తుతెలియని దుండగులు దహనం చేశారు. మొదట దుండగులు కాల్పులు జరిపి, తర్వాత ఇళ్లకు నిప్పుపెట్టారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ ఇళ్లలోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ దారుణ ఘటనపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ, "బిహార్‌లోని నవాడా ప్రాంతంలో పేద దళితుల ఇళ్లను గూండాలు తగులబెట్టడం దారుణం.ఇది ఎంతో బాధాకరమైన ఘటన. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే,బాధితులకు పునరావాసం కల్పించేందుకు ఆర్థిక సహాయం అందించాలి" అని పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నవాడాలో 25 ఇళ్లకు నిప్పు