Page Loader
Bihar: బిహార్‌ విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం 
Bihar: బిహార్‌ విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం

Bihar: బిహార్‌ విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2024
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో సోమవారం జరిగిన బలపరీక్షలో 129 మంది ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఓటు వేయడంతో నితీష్ కుమార్ విజయం సాధించారు. మరోవైపు అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాల నేతృత్వంలోని మహాఘటబంధన్ వాకౌట్ చేసింది. ఫ్లోర్ టెస్ట్‌కు ముందు, బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వానికి 127 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారని, ఫ్లోర్ టెస్ట్‌లో గెలుస్తామని ఎన్‌డిఎ విశ్వాసం వ్యక్తం చేసింది. విశ్వాస పరీక్షకు ముందు ఆర్జేడీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌లో ఉంచారు. జేడీయూకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు నితీష్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారేమోనని ప్రచారం జరిగినా మొత్తానికి నితీష్ కుమార్ ఫ్లోర్ టెస్ట్‌లో నెగ్గారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బిహార్‌ విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం