INDIA bloc: ఇండియా బ్లాక్ మీట్‌కు నితీష్ కుమార్ దూరం..?
డిసెంబరు 6న ఢిల్లీలో జరగనున్న ప్రతిపక్ష భారత కూటమి సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరయ్యే అవకాశం లేదు. నితీష్ కుమార్ కి బదులుగా జెడి(యు)చీఫ్ లాలన్ సింగ్,బీహార్ జలవనరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ ఝా హాజరుకానున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు వ్యూహాన్ని రూపొందించడానికి డిసెంబరు 6న ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ప్రతిపక్ష భారత కూటమి నాయకులు సమావేశమవుతారని ఆదివారం వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం జరగనున్న సమావేశంలో,ఎన్నికలకు ముందు బీజేపీని సమిష్టిగా ఎదుర్కోవడానికి నాయకులు తమ ప్రణాళికను చర్చించి ఖరారు చేయాలని భావిస్తున్నారు.
వైరల్ ఫీవర్ కారణంగా అధికారిక లేదా పబ్లిక్ కార్యక్రమాలకు హాజరు కానీ నితీష్
అంతకుముందు,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ,సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా 2024 లోక్‌సభ ఎన్నికలకు 4-5 నెలల ముందు జరిగే సమావేశానికి హాజరు కావడం లేదని సూచన చేశారు. ఇదిలా ఉంటే,వైరల్ ఫీవర్ కారణంగా నితీష్ ఇన్నిరోజులు అధికారిక లేదా పబ్లిక్ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. గత వారం నలంద జిల్లాలోని రాజ్‌గిర్ మహోస్తావ్‌కు కూడా అయన హాజరు కాలేదు. నితీష్ ఆరోగ్యంపై మెడికల్ బులెటిన్ విడుదల చేయాలని కేంద్ర మంత్రి,బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్, హిందుస్థానీ అవామ్ మోర్చా(సెక్యులర్)అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ వంటి నేతలు డిమాండ్ చేశారు. ప్రతిపాదిత సమావేశంలో సీట్ల పంపకం ఖరారవుతుందని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు,ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ చెప్పారు.