Page Loader
Payel Mukherjee: ప్రముఖ నటిపై బైకర్ దాడి.. ఏడిస్తూ వీడియో పోస్టు
ప్రముఖ నటిపై బైకర్ దాడి.. ఏడిస్తూ వీడియో పోస్టు

Payel Mukherjee: ప్రముఖ నటిపై బైకర్ దాడి.. ఏడిస్తూ వీడియో పోస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2024
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతా అత్యాచారం హత్య ఘటన మరవకముందే మరోసారి ఆ నగరం వార్తల్లో నిలిచింది. బెంగాల్ నటి పాయెల్ ముఖర్జీపై గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి పాయెల్ ముఖర్జీ తన కారులో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాడి నుంచి తప్పించుకున్న పామెల్ ముఖర్జీ కన్నీటి పర్యంతమై, దాడి ఘటన వివరిస్తూ వీడియో పోస్టు చేశారు. స‌ద‌ర‌న్ అవెన్యూలో త‌న కారు ముందు ఓ బైక‌ర్ అడ్డంగా నిల‌బ‌డి, కారు నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని బెదిరించాడ‌ని ఆమె పేర్కొంది.

Details

పాయల్ ముఖర్జీ చేతికి గాయం

పాయల్ ముఖర్జీ బయటికి రాకపోవడంతో ఆ వ్యక్తి తన కుడివైపు ఉన్న అద్దాన్ని పగలగొట్టాడు. ఈ క్రమంలో తన చేతికి గాయమైనట్లు పాయల్ ముఖర్జీ పేర్కొంది. రద్దీగా ఉండే ప్రదేశాల్లోనే ఇలా మహిళను వేధిస్తే, ఇక నిర్జీవ ప్రదేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మహిళలు నైట్ డ్యూటీలకు దూరంగా ఉండాలంటూ మమత ప్రభుత్వ సలహాదారు చెప్పడం నీచమని బీజేపీ మండిపడింది.