Page Loader
Bilkis Bano case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసు.. దోషుల విడుదలను రద్దు చేసిన సుప్రీంకోర్టు
Bilkis Bano case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసు.. దోషుల విడుదలను రద్దు చేసిన సుప్రీంకోర్టు

Bilkis Bano case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసు.. దోషుల విడుదలను రద్దు చేసిన సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Stalin
Jan 08, 2024
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబాన్ని హత్య చేసిన 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వారిని విడుదల చేసే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్ చెల్లుబాటు అవుతుందని ధర్మాసనం పేర్కొంది. 2022 అక్టోబర్‌ 12న జస్టిస్‌ బివి నాగరత్న, జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తర్వాత తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ రోజు తీర్పును వెలువరించింది.

సుప్రీంకోర్టు

అసలు ఈకేసు ఏమిటీ?

గోద్రా అల్లర్ల సమయంలో 2002 మార్చి 3న దాహోద్ జిల్లాలోని రంధిక్‌పూర్ గ్రామంలో బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురైంది. ఆ సమయంలో బిల్కిస్ వయసు 21 ఏళ్లు. అప్పుడు ఆమె 5 నెలల గర్భిణి. అల్లర్లలో బిల్కిస్ కుటుంబానికి చెందిన 14మందిని కూడా హత్య చేశారు. మృతుల్లో బిల్కిస్ 3ఏళ్ల కూతురు కూడా ఉంది. ఆగస్టు 15, 2022న, బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో మొత్తం 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం 1992 క్షమాభిక్ష విధానం ప్రకారం విడుదల చేసింది. జైలు శిక్ష 14 ఏళ్లు పూర్తి కావడం, వయస్సు, ప్రవర్తన, నేరం స్వభావం వంటి అంశాల ప్రాతిపదికన దోషుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో ఎవరు పిటిషన్ వేశారు?

బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల విడుదలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. బిల్కిస్‌తో పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఎం) నేత సుభాషిణి అలీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత మహువా మోయిత్రా, స్వతంత్ర జర్నలిస్టు రేవతి లాల్, లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రూపేఖా వర్మ తదితరులు పిల్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. అంతకుముందు, దోషుల విడుదలకు సంబంధించి బిల్కిస్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను 2022 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు తిరస్కరించడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దోషులను విడుదల చేసే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదు: సుప్రీంకోర్టు