Page Loader
Amaravati: అమరావతిలో బిట్స్‌ క్యాంపస్.. ఆలయ నమూనాలో నిర్మాణం
అమరావతిలో బిట్స్‌ క్యాంపస్.. ఆలయ నమూనాలో నిర్మాణం

Amaravati: అమరావతిలో బిట్స్‌ క్యాంపస్.. ఆలయ నమూనాలో నిర్మాణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2024
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థలు విస్తరిస్తున్నాయి. బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు సీఆర్‌డీఏ 35 ఎకరాలు ఇవ్వనుంది. బిట్స్‌ తన సంస్థ భవనాలను శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నమూనాలో నిర్మించాలనుకుంటోంది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కన, ఆలయానికి సమీపంలో స్థలం కావాలని బిట్స్‌ కోరగా, సీఆర్‌డీఏ కొంతమేర స్థలం అందించేందుకు సిద్ధమైంది. ఐనవోలు, నేలపాడు ప్రాంతాల్లో 50-100 ఎకరాలు ఇవ్వడానికి సీఆర్‌డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ బిట్స్‌ కోరిన 35 ఎకరాలు మాత్రమే అందించే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ సంస్థ కూడా ఐనవోలు వద్ద 2014-19 మధ్యకాలంలో 50 ఎకరాలు కేటాయించిన స్థలాన్ని ఇప్పుడు తీసుకుంటుంది.

Details

సీఎల్పీడబ్ల్యూడి కోసం 28 ఎకరాలు కేటాయింపు

అలాగే బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముందుకొచ్చింది. మరిన్ని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు కూడా రాజధానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. 2014-19 మధ్యకాలంలో సీఆర్‌డీఏ 135 సంస్థలకు స్థలాలు కేటాయించింది. వాటిలో కేంద్రప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. ఈ కేటాయింపుల గడువు ముగియడంతో కొన్ని మార్పులు చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. గతంలో, కేంద్రప్రభుత్వ సంస్థల కార్యాలయాలకు విడివిడిగా స్థలాలు కేటాయించగా, ఇప్పుడు వాటిని ఒకే భవనంలో కలపాలని ప్రతిపాదిస్తున్నారు. సీఎల్పీడబ్ల్యూడి కోసం 28 ఎకరాలు కేటాయించగా, అవసరమైతే మరింత స్థలం ఇవ్వాలని సీఆర్‌డీఏ భావిస్తోంది.

Details

రాజధాని పనులు వేగవంతం

అదే విధంగా, బ్యాంకులకు విడిగా స్థలాలు కేటాయించాలని భావిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల కార్యాలయాలను కూడా టవర్లలోనే ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. 2014-19 మధ్యకాలంలో స్థానిక సంస్థలు స్థలాలు తీసుకున్నప్పటికీ, అవి ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభించలేదు. ప్రస్తుతం, అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం రాజధాని పనులను వేగవంతంగా ప్రారంభించడంతో, సంస్థలు ఈ స్థలాలు కేటాయిస్తే నిర్మాణాలు మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. రాష్ట్రప్రభుత్వం, గత కేటాయింపుల సమీక్ష కోసం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది.