Maharashtra New CM: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఆధిక్యం.. సీఎం ఎవరో తెలుసుకోండి!
మహారాష్ట్రలో మహాయుతి కూటమి భారీ విజయం సాధించనుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతుండగా, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఇప్పటికే డబుల్ సెంచరీ సీట్లు దాటింది. దీంతో ఆ పార్టీ కొత్త రికార్డును సృష్టించనుంది. ఎన్నికల్లో ప్రజలు మహాయుతికి అనుకూలంగా ఓట్లు వేశారు. ఇప్పుడు మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితవుతారన్న ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్, దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రి పదవికి నామినేట్ చేస్తూ కీలక ప్రకటన చేశారు. ఆయనే సీఎం అవుతారని అంచనా వేశారు.
సీఎం రేసులో ఫడ్నవీస్, షిండే?
120 సీట్లు సాధించిన మహాయుతి కూటమి, ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ నేతలు ఫడ్నవీస్‌ను మాత్రమే అభ్యర్థిగా భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మహావికాస్ అఘాడీ కూటమి ఇచ్చిన హామీలు ఎటువంటి ప్రభావం చూపలేదని, మహారాష్ట్ర ప్రజలు వాటిని పట్టించుకోలేదని బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే షిండే కూడా మరాఠా ఓటు బ్యాంకును తన వైపు తిప్పడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.