
Amith Shah: ఇవాళ హైదరాబాద్‌కి హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ మేనిఫెస్టో పేరు తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో హై రేంజ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి.ఇప్పుటికే రెండు సార్లు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన చేశారు.
తాజాగా ఇవాళ కేంద్రహోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణలో రాజధానికి రానున్నారు.
ఈ క్రమంలోనే పార్టీ మేనిఫెస్టో 'ఇంద్రధనస్సు'ను బేగంపేటలోని హోటల్లో అమిత్ షా రిలీజ్ చేయనున్నారు.
ఉచిత విద్య,
ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం,
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్,
రూ.500కే వంట గ్యాస్ సిలిండర్,
వ్యవసాయ కూలీలకు ఏటా రూ.20 వేలు,
వివాహిత మహిళలకు ప్రతి ఏడాది రూ.12 వేలు లాంటి పథకాలపై ప్రకటన చేయనున్నారు.
Details
శుక్రవారం రాత్రి 11 గంటలకు బేగంపేటకు రానున్న షా
జనరిక్ మందుల షాపుల ఏర్పాటు,
TSPSC జాబ్ క్యాలెండర్, 6 నెలల్లో ఖాళీ పోస్టుల భర్తీపై హామీ ఇవ్వనున్నారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు నివాసాలు,
రైతులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు,
బీసీ సబ్ ప్లాన్ వంటి అంశాలు మేనిఫెస్టోలో ఉంటాయని పర్టీ వర్గాలు అంటున్నాయి.
ఇదే షెడ్యూల్ :
శుక్రవారం రాత్రి 11 గంటలకు షా బేగంపేట ఎయిర్ పోర్టులో దిగనున్నారు. అనంతరం 11:30 గంటలకు ఐటీసీ కాకతీయలో బస చేయనున్నారు.
శనివారం ఉదయం 10.30 గంటలకు కత్రియా హోటల్ లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
DETAILS
అమిత్ షా.. తెలంగాణలో ఫుల్ బిజీ
అనంతరం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో గద్వాలకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 1.20 గంటల వరకు బహిరంగ సభసో పాల్గొననున్నారు.
అనంతరం 2:45 నుంచి 3:20 గంటల వరకు నల్గొండ, సాయంత్రం 4:10 నుంచి 4:45 వరంగల్ లో పర్యటించారు.
సుడిగాలి పర్యటనలు చేశాక, బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్ కు 6:10 కు చేరుకోనున్నారు. 6.45 వరకు విశ్రాంతి తీసుకోనున్నారు.
రాత్రి 7 గంటల నుంచి 7:45 గంటల వరకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో ఎమ్మార్పీఎస్ నేతలతో భేటీ కానున్నారు.
రాత్రి 8: 15 కి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనమవనున్నారు.
DETAILS
ఈసారి మేనిఫెస్టోలో నగరాల పేర్లు మార్పు
తెలంగాణలో రాజకీయ ప్రచారం వేడి అందుతోంది.ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడించేందుకు బీజేపీ శాయశక్తుల కృషి చేస్తోంది.
తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు నగరాలు, పట్టణాల పేర్ల మార్పుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
అప్పట్లో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని బండి సంజయ్ అన్నారు. భైంసాను మహీషగా మారుస్తామన్నారు. నిజామాబాద్ ను ఇందూరుగా మార్చాలని గతంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే పేరు మార్పు డిమాండ్లన్నీ రేపు విడుదల కానున్న మేనిఫెస్టోలో హామీలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.