Page Loader
బీజేపీ, కాంగ్రెస్ పోస్టర్ వార్.. రాహుల్ ను రావణ్ అనడంపై మండిపడ్డ జైరాం రమేశ్
ట్విట్టర్ X వేదికగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్

బీజేపీ, కాంగ్రెస్ పోస్టర్ వార్.. రాహుల్ ను రావణ్ అనడంపై మండిపడ్డ జైరాం రమేశ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 06, 2023
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ట్విట్టర్ X వేదికగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్ జరుగుతోంది. ఈ మేరకు రాహుల్ కొత్త యుగం రావణుడంటూ అధికార పార్టీ వివాదాస్పద ట్వీట్ చేసింది. కొత్త యుగం రావణుడు వచ్చేశాడు. ధర్మానికి వ్యతిరేకి. రాముడికి వ్యతిరేకి. భారత్‌ను నాశనం చేయడమే అతడి లక్ష్యమంటూ బీజేపీ ట్వీట్లు పెట్టింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హింసను ప్రేరేపించడమే బీజేపీ లక్ష్యమని, అందుకే రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. మా నాయకుడి తండ్రి, నానమ్మ దేశ విభజన శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యారని జైరాం అన్నారు. ప్రధాని మోదీ, ఇలాంటి పనులు చేయమని తన పార్టీని ప్రోత్సహించడాన్ని ఆయన ఆక్షేపించారు. ఇలాంటి చేష్టలకు తాము బెదిరిపోమన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 రాహుల్ పై వివాదాస్పద ప్రకటన చేసిన బీజేపీ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీ, బీజేపీపై మండిపడ్డ జైరాం రమేశ్