Page Loader
Gwalior: మురుగు కాలువను శుభ్రం చేసిన బీజేపీ కౌన్సిలర్.. వీడియో వైరల్ 
Gwalior: మురుగు కాలువను శుభ్రం చేసిన బీజేపీ కౌన్సిలర్.. వీడియో వైరల్

Gwalior: మురుగు కాలువను శుభ్రం చేసిన బీజేపీ కౌన్సిలర్.. వీడియో వైరల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2024
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

మురుగు కాలువ సమస్య ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో ఓ కౌన్సిలర్ తనే స్వయంగా రంగంలోకి దిగాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని వార్డు-15 బీజేపీ కౌన్సిలర్ దేవేంద్ర రాథోడ్ స్థానికంగా ఉన్న డ్రైనేజీ నిండిపోయిందని,దాన్ని శుభ్రం చేయాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశాడు. మున్సిపల్ కార్పొరేషన్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్వయంగా డ్రైనేజీలోకి దిగి క్లీన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Details 

ప్రజలు నాకు ఓటు వేశారు, నేను వారి ఓటుకు విలువ ఇవ్వాలి: కౌన్సిలర్ 

ప్రజలు తనను కౌన్సిల్‌కు ఎన్నుకున్నారని, ఎన్నిసార్లు విన్నవించినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ బాధ్యతను తానే తీసుకున్నానని కౌన్సిలర్‌ తెలిపారు. "ప్రజలు నాకు ఓటు వేశారు, నేను వారి ఓటుకు విలువ ఇవ్వాలి, అందుకే ఎవరూ వినకపోవడంతో మురుగు కాలువను శుభ్రం చేశాను. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, నేను శుభ్రం చేసిన తర్వాత, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు కూడా వచ్చి శుభ్రం చేయడం ప్రారంభించారు," అని అయన తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మురుగు కాలువను శుభ్రం చేస్తున్న కౌన్సిలర్