Page Loader
Rahul Vs CR Kesavan: రాహుల్ గాంధీపై కేశవన్ ఫైర్.. అమెరికా పర్యటన 'భారత్ బద్నాం యాత్ర'
రాహుల్ గాంధీపై కేశవన్ ఫైర్

Rahul Vs CR Kesavan: రాహుల్ గాంధీపై కేశవన్ ఫైర్.. అమెరికా పర్యటన 'భారత్ బద్నాం యాత్ర'

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2024
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటన ఇప్పుడు వివాస్పదంగా మారింది. మరోవైపు అమెరికాలో రాహుల్ గాంధీ భారత్‌పై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే, భారత్‌లో మాత్రం ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆరోపించింది. దీనికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

వివరాలు 

రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారు

రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సందర్భంగా చేసిన భారత వ్యతిరేక వ్యాఖ్యలకు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రాజాజీ మునిమనవడు సీఆర్ కేశవన్ కోరారు. గత ఏడాది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సీఆర్ కేశవన్ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను భారత్ బద్నామ్ యాత్రగా కేశవన్ అభివర్ణించారు. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా సత్యాన్ని వక్రీకరిస్తున్నారని,విదేశాలలో భారతదేశ ప్రతిష్ట, గౌరవాన్నితగ్గించడానికి అబద్దాలు చెబుతున్నారని కేశవన్ ఆరోపించారు. ఇలాంటి చర్యలను భారత ప్రజలు మరచిపోలేరని, క్షమించరని అన్నారు.

వివరాలు 

రాహుల్ దేశానికి క్షమాపణ చెప్పాలి: కేశవన్  

రాహుల్ గాంధీ తన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేశవన్ కోరారు. అలాగే మహాభారతంలోని శిశుపాలడి పాత్రను రాహుల్ గాంధీతో పోల్చిన సీఆర్ కేశవన్.. శిశుపాలడు కృష్ణుడిని బహిరంగంగా అవమానించాడని, రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నప్పుడు భారతదేశాన్ని అవమానించారని అన్నారు. అంతకుముందు, మంగళవారం (సెప్టెంబర్ 10) వాషింగ్టన్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ప్రెస్ ఫోరమ్‌లో విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ, చైనాతో వివాదాన్ని పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు . అలాగే, రిజర్వేషన్ సహా పలు అంశాలపై మాట్లాడారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీఆర్ కేశవన్ మాట్లాడుతున్న వీడియో