Prajwal Revanna: రేవన్న కేసులో పోలీసుల అదుపులో బిజెపి నేత
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక జెడీ(ఎస్) హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న పై గత కొన్ని రోజులుగా పలువురు మహిళలపై అత్యాచార చేశారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రేవన్నను గత శుక్రవారం కస్టడీలోకి పోలీసులు తీసుకున్నారు. ఈ కేసును వెలుగులోకి తెచ్చిన బిజెపి నేత జి . దేవరాజ్ గౌడను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.
బెంగుళూరు నుంచి చిత్రదుర్గ వెళుతుండగా బిజెపి నేతను అదుపులోకి తీసుకున్నట్లు స్దానిక పోలీసులు తెలిపారు.
తన ఆస్తిని అమ్మి పెట్టడంలో సహకరిస్తానన్న సాకు చూపి తనపై దేవరాజ్ గౌడ అత్యాచారానికి 36 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Details
ఆరోపణలు వెనుక కాంగ్రెస్ హస్తం
ఈ బిజెపి నేత 2003 కర్ణాటక ఎన్నికల్లో ప్రజ్వల్ రేవన్నతండ్రి హోలెన్సి పూరా ఎంఎల్ ఎ అభ్యర్ది హెచ్డీ రేవన్న పై పోటీ చేశారు.
తన కుమారుడితో సహా పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు రేవన్న ఎదుర్కొంటున్నారు.
అయితే ఈ ఆరోపణలు వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని జెడీ(ఎస్)నేత ఆరోపిస్తున్నారు.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ప్రజ్వల్ రేవన్నపై మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నందున తనకు హసన్ లోక్ సభ టికెట్ ఇవ్వద్దని గత ఏడాదే బిజెపి అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చినట్లు హెచ్డీ రేవన్నచెపుతున్నారు.
2002 లో బిజెపి-జెడీ(ఎస్)పొత్తు కుదిరిన సంగతి విదితమే.ప్రజ్వల్ రేవన్నను ఈ సారి హసన్ నుంచి పోటీకి నిలపరాదని జెడీ(ఎస్)నిశ్చయించినట్లు హెచ్డీ రేవన్న వాదనగా ఉంది.
Details
మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వీడియోలు బయటికి
హసన్ లోక్ సభ సీటుకు పోలింగ్ కు ముందు రోజే ఏప్రిల్ 26న ప్రజ్వల్ మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
33ఏళ్ల ప్రజ్వల్ పలువురు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వీడియోలు బయటికి వచ్చాయి.
ప్రజ్వల్ రేవన్నమాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ కు మనవుడు అవుతారు. వీడియోలు బహిర్గతం కాగానే ప్రజ్వల్ తన వద్ద వున్న దౌత్య వీసాను చూపి జర్మనీ పారిపోయారు.
కాగా ఆయనను రప్పించటానికి బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది.ఇంటర్ పోల్ ద్వారా పలు సభ్య దేశాలను అప్రమత్తం చేసింది.
అత్యాచారం, లైంగిక వేధింపులు , బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రజ్వల్ పై ఇప్పటికే మూడు ఎఫ్ .ఐ.ఆర్ లు దాఖలు అయ్యాయి.