
BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్.. రైతులకు రుణమాఫీ, వృద్ధులకు పెన్షన్ పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా భాజపా తన 'సంకల్ప్ పత్ర'ని రిలీజ్ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దాన్ని విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని అనేక హామీలను ప్రకటించారు.
యువత, పేదలు, రైతులు, మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. స్కిల్ సెన్సస్, స్టార్టప్‌ల అభివృద్ధి, శివాజీ మహారాజ్ కేంద్రం, ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాట్లతో పాటు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఇక ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)పై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, బీజేపీ మతాధారిత రిజర్వేషన్లకు అనుమతించదని స్పష్టం చేశారు.
Details
నవంబర్ 23న ఫలితాలు
మహారాష్ట్రలో సుస్థిరమైన పరిపాలన కోసం మహాయుతి ప్రభుత్వాన్ని కొనసాగించాలని సూచించారు.
అమిత్ షా, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు మరికొందరు నేతలు మహారాష్ట్రను వికసిత రాష్ట్రంగా మార్చేందుకు తమ పథకాలను ప్రకటించారు.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబర్ 20న పోలింగ్, 23న ఫలితాలు ప్రకటించనున్నారు.
ప్రస్తుతం భాజపా, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి ప్రతిపక్షంగా ఎన్నికలలో పాల్గొంటుంది.
Details
మ్యానిఫెస్టో కీలక అంశాలు ఇవే
1.ఉద్యోగం సృష్టి
25 లక్షల ఉద్యోగాల సృష్టి
2. నైపుణ్య గణన
ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల డిమాండ్, సరఫరా అంచనా వేయడం.
3. లఖపతి దీదీ పథకం విస్తరణ
50 లక్షల మంది మహిళలకు ఆర్థిక సహాయం.
4. ఎరువుల జీఎస్టీ వాపసు
రైతులకు ఎరువులపై చెల్లించిన జీఎస్టీ తిరిగి చెల్లించడం.
5. పారిశ్రామిక రుణాలు
పరిశ్రమల అభివృద్ధికి రూ. 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు.
6. వ్యవసాయ రుణాల మాఫీ
రైతుల రుణ మాఫీ
7. పెన్షన్ పెంపు
వృద్ధులకు పెన్షన్ రూ. 2,100 వరకు పెంపు.
8. ధరల స్థిరీకరణ
నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణకు చర్యలు.