LOADING...
Delhi speaker: ఢిల్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్‌ గుప్తా 
Delhi speaker: ఢిల్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్‌ గుప్తా

Delhi speaker: ఢిల్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్‌ గుప్తా 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ రాజకీయ పరిణామాల్లో ముందుగా ఊహించినట్లుగానే,బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాకు అసెంబ్లీ స్పీకర్ పదవి లభించింది. విజేందర్ గుప్తా స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే, ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతిపక్ష నాయకురాలు అతిషి సింగ్ కలిసి ఆయనను పోడియం వద్దకు తీసుకెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో, బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది, ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది. విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది,ఇందులో బీజేపీ మహిళా ఎమ్మెల్యే రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

వివరాలు 

అసెంబ్లీలో  రేపు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం 

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, తొలిసారి ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం మూడు రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలి రోజు ప్రొటెం స్పీకర్‌ను నియమించి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరిగింది. రేపు లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్పీకర్ కుర్చీలో విజేందర్‌ గుప్తా