
BJP: ప్రొటెం స్పీకర్ నియామకంపై నిరసన..అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
అసెంబ్లీలో సీనియర్లు ఉన్నా.. కావాలనే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా నియమించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం నేపథ్యంలో కాంగ్రెస్-ఎంఐఎం మధ్య బంధం మరోసారి బయటపడిందన్నారు.
రెగ్యులర్ స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేస్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే తాము ప్రమాణం చేయబోమని రాజాసింగ్ శుక్రవారమే ప్రకటించారు. ఆయన మాటలను కొనసాగిస్తూ.. కిషన్ రెడ్డి మాట్లాడారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అక్బరుద్దీన్ ముందు ప్రమాణం చోయబోం: బీజేపీ ఎమ్మెల్యే
అసెంబ్లీ బహిష్కరించాలని బీజేపీ నిర్ణయం.. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ముందు ప్రమాణం చేయొద్దని డిసైడ్ అయిన బీజేపీ.. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి బీజేపీకి ఆఫీసుకు వెళ్లనున్న ఎమ్మెల్యేలు.. #Telangana #BJP
— NTV Breaking News (@NTVJustIn) December 9, 2023