Page Loader
Parliament: రాహుల్ గాంధీ కారణంగా బీజేపీ ఎంపీకి గాయాలు.. స్పందించిన  కాంగ్రెస్ నేత  
రాహుల్ గాంధీ కారణంగా బీజేపీ ఎంపీకి గాయాలు

Parliament: రాహుల్ గాంధీ కారణంగా బీజేపీ ఎంపీకి గాయాలు.. స్పందించిన  కాంగ్రెస్ నేత  

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2024
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంటు ఆవరణలో గురువారం తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అమిత్‌ షా అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ, ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసనలు ప్రదర్శించారు. అంబేద్కర్‌ను అవమానించినట్లు పరస్పర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంలో, ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటులోకి వెళ్ళిపోతున్న ఎంపీలను అడ్డుకున్నట్లు తెలుస్తుంది. ఈ గొడవలో ఒడిశా ఎంపి గాయాలపాలయ్యారు. స్వల్ప గాయాలు అయ్యిన ఆ ఎంపిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వారిని నెట్టేశారంటూ అధికార పక్షం ఆరోపించింది. ఈ వివాదం కారణంగా, పార్లమెంటు ఆవరణలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో, లోక్‌సభ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పార్లమెంటు ఆవరణలో తీవ్ర ఉద్రిక్తతలు