Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సర్వం సిద్ధం..99 మంది అభ్యర్థుల తొలి లిస్ట్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమైంది. 99 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
ఈ ఫస్ట్ లిస్ట్‌లో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు అశోక్ చవాన్ కూతురి పేర్లు ఉన్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీకి 288 స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు నవంబర్ 20న జరగబోతున్నాయి.
ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు ప్రధాన కూటముల మధ్య పోరు ఏర్పడింది.
అధికార బీజేపీ నేతృత్వంలోని ''మహాయుతి'' కూటమి,కాంగ్రెస్ నేతృత్వంలోని ''మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)'' కూటమి మధ్య ఈ పోటీ జరుగుతుంది.
మహాయుతి కూటమిలో బీజేపీ, షిండే శివసేన మరియు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఉన్నాయి.
అయితే ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్, ఠాక్రే శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఉన్నాయి.
వివరాలు
288 సీట్లలో బీజేపీ 151లో పోటీ
మొత్తం 288 సీట్లలో బీజేపీ 151లో పోటీ చేయబోతుంది, మిగిలిన సీట్లను శివసేన,ఎన్సీపీ పంచుకుంటాయి.
దేవేంద్ర ఫడ్నవీస్ మళ్లీ నాగ్‌పూర్ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
2009 నుంచి ఫడ్నవీస్ ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. నాగ్‌పూర్ బీజేపీకి కంచుకోటగా ఉంది.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే నాగ్‌పూర్ జిల్లా కమ్తి నుంచి పోటీ చేస్తున్నారు.
ప్రస్తుత రాష్ట్ర మంత్రి సుధీర్ మునిగంటివార్ బల్లార్‌పూర్ నుంచి పోటీ చేస్తుండగా, కేంద్రమంత్రి రావు సాహెబ్ దాన్వే కుమారుడు సంతోష్ భోకర్దాన్ నుంచి బరిలోకి దిగారు.
నాగ్‌పూర్ రీజియన్ బీజేపీకి కంచుకోటగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విజయం సాధించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీజేపీ 99 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల
BJP releases the first list of 99 candidates for the #MaharashtraElection2024. pic.twitter.com/GphO1vs5p0
— ANI (@ANI) October 20, 2024