
Karnataka: దేవాలయాలపై పన్ను చెల్లించాల్సిందే.. కాంగ్రెస్ 'హిందూ వ్యతిరేక విధానాలను' తప్పుబట్టిన బీజేపీ
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో 'కర్ణాటక హిందూ మత సంస్థలు, ధార్మిక ధర్మాదాయ బిల్లు 2024'ను ఆమోదించింది.
బిల్లు ఆమోదం తర్వాత భారతీయ జనతా పార్టీ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని "హిందూ వ్యతిరేకి" అనిఅభివర్ణించింది.
వాస్తవానికి ₹ 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల నుండి 10 శాతం, ₹ 10 లక్షల నుండి ₹ 1 కోట్ల మధ్య ఆదాయం ఉన్న దేవాలయాల నుండి 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని కర్ణాటక ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
Details
ఖాళీ ఖజానాను నింపుకునేందుకే ఈ బిల్లు: విజయేంద్ర యడియూరప్ప
కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబించడం ద్వారా తన ఖజానాను నింపుకోవాలని చూస్తోందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు హిందూ దేవాలయాల ఆదాయంపై వంకలు పెట్టి, ఖాళీ ఖజానాను నింపుకునేందుకు హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ శాఖ బిల్లును ఆమోదించిందని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి స్పందిస్తూ బీజేపీ మతాన్ని రాజకీయాల్లోకి తీసుకువస్తోందని ఆరోపించారు. హిందూ మతానికి నిజమైన ప్రతిపాదకుడు కాంగ్రెస్ అని అన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విజయేంద్ర యడియూరప్ప చేసిన ట్వీట్
ರಾಜ್ಯದಲ್ಲಿ ಸರಣೀ ರೂಪದಲ್ಲಿ ಹಿಂದೂ ವಿರೋಧಿ ಧೋರಣೆ ಅನುಸರಿಸುತ್ತಿರುವ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಇದೀಗ ತನ್ನ ಬರಿದಾಗಿರುವ ಬೊಕ್ಕಸ ತುಂಬಿಸಿಕೊಳ್ಳಲು ಹಿಂದೂ ದೇವಾಲಯಗಳ ಆದಾಯದ ಮೇಲೂ ವಕ್ರ ದೃಷ್ಟಿ ಬೀರಿ ಹಿಂದೂ ಧಾರ್ಮಿಕ ಸಂಸ್ಥೆಗಳ ಮತ್ತು ಧರ್ಮಾದಾಯ ದತ್ತಿಗಳ ವಿಧೇಯಕವನ್ನು ಮಂಡಿಸಿ ಅಂಗೀಕಾರ ಪಡೆದು ಕೊಂಡಿದೆ.
— Vijayendra Yediyurappa (@BYVijayendra) February 21, 2024
ಇದರ ಅನುಸಾರ ಇನ್ನು ಮುಂದೆ 1… pic.twitter.com/UwcN7yjjss