LK Advani : ఆసుపత్రిలో చేరిన బీజేపీ అగ్రనేత
బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది.ఆయన బుధవారం రాత్రి ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అద్వానీని మధుర రోడ్డులోని అపోలో ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు.ఇటీవల అద్వానీ దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీని డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో రాత్రి 9గంటలకు అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు అపోలో ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. అబ్జర్వేషన్‌లో ఉన్న ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.లాల్ కృష్ణ అద్వానీ బిజెపి సీనియర్ నాయకుడు,దేశ మాజీ ఉప ప్రధాని. 96ఏళ్ల అద్వానీ ఇటీవల న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు.ఆతర్వాత జూన్ 27 మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు.