Page Loader
Maharashtra: ఎన్నికల సభలో బీజేపీ మహిళా నేత నవనీత్ రాణాపై దాడి
ఎన్నికల సభలో బీజేపీ మహిళా నేత నవనీత్ రాణాపై దాడి

Maharashtra: ఎన్నికల సభలో బీజేపీ మహిళా నేత నవనీత్ రాణాపై దాడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2024
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికల ప్రచార సభలో భాగంగా బీజేపీ నాయకురాలు నవనీత్ రాణాపై దాడి జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని దరియాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖల్లార్ గ్రామంలో జరుగుతున్న ప్రచార సభలో ఆమె ప్రసంగం ముగించుకొని కిందికి రాగానే, కొందరు ఆమెపై కుర్చీలు విసిరేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై నవనీత్ రాణా ఖల్లార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నవనీత్ రాణా ప్రచార సభ జరుగుతుండగా కొందరు గందరగోళం సృష్టించారు.

Details

పోలీసులకు ఫిర్యాదు

ఆమె ప్రసంగం ముగించుకుని కిందికి వచ్చాక, వారు ఒక మతాన్ని గౌరవిస్తూ నినాదాలు చేశారు. కొందరు ఆగంతకులు తన మీద ఉమ్మి వేశారని కూడా ఆమె చెప్పారు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆమెను కాపాడి బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై వెంటనే ఫిర్యాదు చేసిన నవనీత్ రాణా, నిందితులను అరెస్ట్ చేయకుంటే హిందూ సమాజం నిరసన తెలపడానికి ముందుకు రావాలని పేర్కొన్నారు.