
High Alert In Rajasthan:రాజస్థాన్‌లో సైరన్లతో బ్లాక్‌అవుట్.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్‌లో హై అలర్ట్ ప్రకటించారు.
సరిహద్దు జిల్లాలైన జైసల్మేర్, రాంఘడ్, బడ్‌మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్‌లలో బ్లాక్ అవుట్ అమలు చేశారు.
శాంతి భద్రతల దృష్ట్యా సాయంత్రం 5 గంటల నుంచి ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని భారత సైన్యం ఆదేశాలు జారీ చేసింది.
నిన్నటి తరహాలో ఇవాళ కూడా జైసల్మేర్ ప్రాంతంలో పాకిస్థాన్ నుంచి దాడుల అవకాశముందని ముందస్తు హెచ్చరికలు అందాయి.
గురువారం రాత్రి 9 గంటల సమయంలో జైసల్మేర్‌లో సైరన్లు మోగిన వెంటనే నగరమంతా బ్లాక్ అవుట్ అమలయ్యింది.
Details
విద్యుత్ సరఫరా నిలిపివేత
విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో నగరం పరిసరాల్లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
ఈ ఘటనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. పేలుళ్ల శబ్దాలు అర్థరాత్రివరకు వినిపించాయని వారు చెబుతున్నారు. పాకిస్థాన్ దాడులకు భారత ఆర్మీ ధీటుగా ప్రతిచర్య తెలిపింది.
ఆకస్మిక పరిస్థితుల్లో సైన్యం సమర్థవంతంగా స్పందించిందని సమాచారం.
ఉద్రిక్తతల నేపథ్యంలో రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో భద్రతా చర్యలు మరింత కఠినంగా కొనసాగుతున్నాయి.