Kerala: 5ఏళ్ల బాలికను కిడ్నాప్; అత్యాచారం చేసి ఆపై హత్య
కేరళలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన వలస కార్మికుడి 5ఏళ్ల కుతురిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారం చేసి, గొంతుకోసం చంపేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి మృతదేహం ఎర్నాకులం మార్కెట్ వెనుక ప్రాంతంలో గోనె సంచులలో పడేసి కనిపించినట్లు వెల్లడించారు. బాలిక శుక్రవారం అదృశ్యమైనట్లు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చిన్నారి నిందితుడితో ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి అనంతరం నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు మద్యం మత్తులో ఈ అఘాయిత్యం చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు నేరం అంగీకరించాడని, అంతకుముందు దర్యాప్తు బృందాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని కొచ్చి రేంజ్ డీఐజీ శ్రీనివాస్ తెలిపారు.