Page Loader
Mumbai: వడాలాలో దారుణం.. బ్యాగ్‌లో సగం కాలిన మహిళ మృతదేహం గుర్తింపు
Mumbai: వడాలాలో దారుణం.. బ్యాగ్‌లో సగం కాలిన మహిళ మృతదేహం గుర్తింపు

Mumbai: వడాలాలో దారుణం.. బ్యాగ్‌లో సగం కాలిన మహిళ మృతదేహం గుర్తింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2023
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై నగరంలోని వడాలా ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ సగం కాలిపోయిన మృతదేహాన్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుమానాస్పద బ్యాగ్‌లో కాలిపోయిన మృతదేహం లభించింది. గుర్తు తెలియని నిందితుడిపై హత్య కేసు నమోదు చేశారు. వాడాలా ప్రాంతం నుండి సగం కాలిపోయిన మహిళ మృతదేహాన్ని మేము స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముంబై పోర్ట్ ట్రస్ట్‌లోని తమ పెట్రోలింగ్ బృందం కాలిపోయిన మృతదేహాన్ని కలిగి ఉన్న అనుమానాస్పద బ్యాగ్‌ను కనుగొందని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపామని, గుర్తు తెలియని వ్యక్తిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Mumbai: బ్యాగ్‌లో సగం కాలిన మహిళ మృతదేహం