తదుపరి వార్తా కథనం

Bomb Attack: బీహార్‌లో స్కూల్‌పై బాంబు దాడి.. సీసీ కెమెరాల్లో రికార్డ్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 11, 2025
02:22 pm
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రైవేట్ పాఠశాలపై రాళ్లు, బాంబులతో దాడి చేశారు.
ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాజీపుర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద కొందరు వ్యక్తులు ఆకస్మాత్తుగా రాళ్లు రువ్వారు.
అంతేకాదు, పొగ బాంబులు విసిరారు. అయితే, ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు.
ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దాడికి కారణాలేంటనే విషయంపై వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.