Shamshabad: ఇండిగో విమానంలో బాంబు కలకలం.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. కన్నూర్ (కేరళ) నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఓ కాగితంపై ఈ విషయాన్ని రాసి విమానం బాత్రూమ్‌లో పెట్టాడు. దీన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే విమాన సిబ్బందికి సమాచారం అందించారు.
వివరాలు
విమానంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు
సమాచారం అందుకున్న పైలట్ అప్రమత్తమై విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
అనంతరం ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్ బృందాలు విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి.
అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎవరనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.