Page Loader
బాంబు బెదిరింపు: రష్యా నుంచి గోవా వస్తున్న విమానం ఉజ్బెకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
రష్యా నుంచి గోవా వస్తున్న విమానం ఉజ్బెకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

బాంబు బెదిరింపు: రష్యా నుంచి గోవా వస్తున్న విమానం ఉజ్బెకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

వ్రాసిన వారు Stalin
Jan 21, 2023
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు వస్తున్న చార్టర్డ్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో షాక్‌కు గురైన అధికారులు విమానాన్ని అత్యవరస ల్యాండింగ్ కోసం ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. శనివారం తెల్లవారుజామున జరిగన ఈ ఘటనతో అధికారులు హడలెత్తిపోయారు. రష్యాలోని పెర్మ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి గోవాకు వెళ్లే అజూర్ ఎయిర్ చార్టర్డ్ ఫ్లైట్‌కు భద్రతాపరమైన ముప్పు ముప్పు రావడంతో ఆ విమానాన్ని ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు శిశువులతో పాటు ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 238 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

విమానం

గత 11 పదకొండు రోజుల్లో ఇది రెండో బాంబు బెదిరింపు

విమానంలో బాంబు అమర్చినట్లు దబోలిమ్ విమానాశ్రయ డైరెక్టర్‌కు అర్ధరాత్రి 12.30 గంటలకు ఈ-మెయిల్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తెల్లవారుజామున 4.15 గంటలకు గోవాలోని దబోలిమ్ విమానాశ్రయానికి ఆ విమానం చేరుకోవాల్సి ఉంది. భారత గగనతలంలోకి ప్రవేశించకముందే ఆ విమాన్ని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. మాస్కో-గోవా వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు రావడం గత 11 పదకొండు రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. జనవరి 9న, విమానంలో బాంబు బెదిరింపు ఉందని గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి ఈ-మెయిల్ రావడంతో 244 మంది ప్రయాణికులు, సిబ్బందితో కూడిన ఫ్లైట్‌ను జామ్‌నగర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానాన్నిక్షుణ్ణంగా తనిఖీ చేసిన బాంబ్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి పేలుడు పదార్ధాన్ని కనుకొనబడలేదు.