
Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది.
ఈ ఘటనతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇటీవలి కాలంలో 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభమైన తరువాత భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది.
ఈ పరిణామాల మధ్య పాకిస్థాన్ నుంచి భారత్‌కు పలు బెదిరింపులు మెయిల్స్, ఫోన్ల రూపంలో వస్తున్నట్టు తెలుస్తోంది.
దేశంలోని స్టేడియాలు, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని బాంబులతో దాడి చేస్తామని మెసేజ్‌లు అందుతున్నాయి.
ఇలాంటి పరిణామాల్లో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
Details
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
పాకిస్థాన్ స్లీపర్ సెల్స్ పేరుతో వచ్చిన ఈ మెయిల్‌లో ఏ క్షణమైనా విమానాశ్రయాన్ని పేల్చేస్తామని హెచ్చరించారు.
ఈ సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై విమానాశ్రయ పరిధిలో విస్తృతంగా తనిఖీలు ప్రారంభించాయి.
డాగ్ స్క్వాడ్ సాయంతో విమానాశ్రయం మొత్తం తనిఖీ చేశారు. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
ఇప్పటికే అధికారులు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తులు ఎవరు? ఎక్కడినుంచి పంపారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.