Page Loader
Hyderabad: హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు.. 
హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు..

Hyderabad: హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరంలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి పోలీసులను అప్రమత్తం చేశాడు. ఈ బెదిరింపు నేపథ్యంలో కోర్టు ప్రాంగణంలో భద్రతా చర్యలు ముమ్మరమయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. కోర్టులో ఉన్న సిబ్బందిని భవనం వెలుపలికి పంపించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించి కోర్టు సముదాయంలో జల్లెడ పడుతున్నారు. ఆపత్కాలంలో ఎలాంటి ప్రమాదం సంభవించకుండా చూసేందుకు చీఫ్ మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేశారు. ఈ అనూహ్య పరిస్థితులతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు